Fact Check : జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు స్టార్టవుతాయా? ఇది నిజమేనా?

By Newsmeter.Network  Published on  2 Jun 2020 8:18 AM GMT
Fact Check : జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు స్టార్టవుతాయా? ఇది నిజమేనా?

తెలంగాణ వ్యాప్తంగా ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోతుందన్నది దాని సారాంశం. ప్రధాన స్రవంతి వార్తా సంస్థలతో పాటు.. చాలా వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానెళ్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. కొన్ని సంస్థలైతే 'ఇవిగో మార్గదర్శకాలు...' అంటూ మరింత అత్యుత్సాహం ప్రదర్శించాయి. జనం కూడా ఈ అంశంపై తెగ చర్చించుకుంటున్నారు.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత విద్యాసంవత్సరం పూర్తికాకుండానే స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు అప్పటినుంచీ ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం వేసవి సెలవులకు ఊళ్లకు కూడా వెళ్లే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. దీంతో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు స్కూళ్లు ఎప్పుడు స్టార్టవుతాయా ? అని పేరెంట్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైన క్రమంలో స్కూళ్లు తెరవడానికి సంబంధించి కూడా త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సమయంలోనే జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు మొదలవుతాయన్న వార్త వైరల్‌గా మారింది. న్యూస్‌ వెబ్‌సైట్లలో వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో కూడా షేరింగ్ అయ్యింది. వాటికి సంబంధించిన వెబ్‌సైట్‌ లింకులు, వాటి స్క్రీన్‌ షాట్స్‌ కింద చూడవచ్చు.

Ts1

https://10tv.in/schools-telangana-reopen-july-1st-2916

Ts2

https://telugu.asianetnews.com/telangana/from-1st-july-onwards-schools-open-in-telangana-qb8j9a

Ts3

https://telugu.oneindia.com/news/telangana/schools-will-open-on-july-1st-in-telangana-269958.html

చాలా మీడియా, వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్‌ చేయడంతో అందరికీ నిజమే అన్న ఆలోచన కలగడం సహజం. కానీ, దీనిపై ఫ్యాక్ట్‌చెక్‌ చేయాలని న్యూస్‌ మీటర్‌ తలచింది. ఎందుకంటే ప్రభుత్వం సర్క్యులర్ గానీ, మార్గదర్శకాలు గానీ అధికారికంగా జారీచేసిన దాఖలాలు లేవు. అందుకే దీనిపై పరిశోధిస్తుండగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌లో ఇదే అంశాన్ని పోస్ట్‌ చేసింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్‌ రమణకుమార్‌ జారీచేసిన ఆదేశాలు అంటూ అందులో పేర్కొన్నారు.

Ts4కానీ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌ను ట్యాగ్‌ చేసిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) అది ఫేక్‌ న్యూస్‌ అలర్ట్‌ అంటూ క్లారిటీ ఇచ్చింది.

Ts5అయితే.. అప్పటికే చాలా వెబ్‌సైట్లు ఈ వార్తను పోస్ట్‌ చేశాయి. అయితే.. ట్విట్టర్‌లో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోనే మొదట వివరణ ఇచ్చాయి. PIB వివరణతో ఆ వార్తను అప్‌డేట్‌ చేశాయి. వాటి స్క్రీన్‌షాట్లు, లింకులు కింద చూడొచ్చు.

Ts6

https://tv9telugu.com/schools-in-telangana-will-reopen-from-july-1st-252101.html

Ts7

https://telugu.samayam.com/education/news/schools-in-telangana-may-be-will-reopen-from-july-1st-not-sure/articleshow/76133883.cms

మొత్తానికి జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకుంటాయంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని న్యూస్‌ మీటర్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ దర్యాప్తులో తేలింది.

ప్రచారం : జూలై 1 వ తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్‌ ఓపెన్‌

వాస్తవం : ఈ ప్రచారం అవాస్తవం. ప్రభుత్వం ఇంకా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కంక్లూజన్‌ : ఒక వార్తా సంస్థ ఈ సమాచారాన్ని పోస్ట్‌ చేయగానే.. జనంలో ఉన్న ఉత్సుకతను దృష్టిలో పెట్టుకున్న మిగతా సంస్థలన్నీ అనుసరించాయి. కానీ, ఇది వాస్తవం కాదని తేలింది.

Claim Review:Fact Check : జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు స్టార్టవుతాయా? ఇది నిజమేనా?
Claim Fact Check:false
Next Story