Fact Check : నటుడు రావు రమేష్ జగన్ సంవత్సర పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 10:48 AM GMT
Fact Check : నటుడు రావు రమేష్ జగన్ సంవత్సర పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారా..?

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా తప్పుడు సమాచారం వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను వాడుకుంటూ.. తప్పుడు వార్తలను వైరల్ చేయడం చూసే ఉంటాం. తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేష్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక సంవత్సర పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్వీట్లు, అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

#1yearofmassdestruction అనే హ్యాష్ ట్యాగ్ తో పలు ట్వీట్స్ ఆ అకౌంట్ నుండి బయటకు వచ్చాయి. మొదటి విధ్వంసం.. చాలా బాధపడ్డ.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ-మీ రావు రమేష్ అంటూ అందులో ఓ బిల్డింగ్ ను కూల్చి వేస్తున్న ఫోటో కనిపించింది.

R1

పోలవరం ప్రాజెక్టు పై ఒక్క సంవత్సరం పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలి..? అని ప్రశ్నిస్తూ మరో ట్వీట్.

R2

ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ట్వీట్స్ ఆ అకౌంట్ నుండి వెలువడ్డాయి.

నిజనిర్ధారణ:

రావు రమేష్ పేరు మీద మొదలుపెట్టిన ఫేక్ అకౌంట్ అని తెలుస్తోంది. అది కూడా మే నెలలో ఈ అకౌంట్ ను క్రియేట్ చేశారు.

R3

ఆ అకౌంట్ కు ట్విట్టర్ 'వెరిఫైడ్ బ్లూ టిక్' లేదు. ఈ ట్వీట్స్ వైరల్ అవుతూ ఉండగా.. తనకు సోషల్ మీడియా అకౌంట్లు అన్నవే లేవంటూ రావు రమేష్ ఒక పత్రికా ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.



'నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు, ఫేస్ బుక్ గానీ, ట్విట్టర్ గానీ , ఇన్ స్ట్రా గ్రామ్ ఇలా ఏమి లేవు..ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు...ఆ పోస్టులు కు గానీ , ఆ అకౌంట్ కు గానీ నాకు ఏటువంటి సంబంధం లేదు..దయచేసి వాటిని నమ్మకండి..' అంటూ రావు రమేష్ చెప్పినట్లుగా పలు తెలుగు మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి.

https://www.telugucinema.com/news/rao-ramesh-take-action-fake-accountshttps://www.andhrajyothy.com/telugunews/rao-ramesh-clarity-about-viral-tweet-2020053003530258https://www.sakshi.com/news/movies/i-have-no-social-media-accounts-said-actor-rao-ramesh-1290348

చాలా మంది వినియోగదారులు నివేదించిన తరువాత ట్విట్టర్ నకిలీ ఖాతాను తీసివేసింది.

R4

Claim Review:Fact Check : నటుడు రావు రమేష్ జగన్ సంవత్సర పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారా..?
Claim Fact Check:false
Next Story