హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి యువతిని ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండగా, ప్రణీత అనే మహిళ కారును వేగంగా నడుపుకొంటూ.. రోడ్డును క్రాస్‌ చేస్తున్న యువతిని ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో అలేఖ్య కారు కింది భాగంలో నలిగిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ కారును అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.