స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఘన విజయం.. సూపర్‌-12కు జింబాబ్వే

Zimbabwe beat Scotland by five wickets. టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వే సూపర్‌-12లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో

By Medi Samrat  Published on  21 Oct 2022 4:00 PM GMT
స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఘన విజయం.. సూపర్‌-12కు జింబాబ్వే

టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వే సూపర్‌-12లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. క్రెయిగ్‌ ఇర్విన్‌(58 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడగా.. సికందర్‌ రజా 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ డేవీ 2, బ్రాడ్‌ వీల్‌, మార్క్‌ వాట్‌, మైకెల్‌ లీస్క్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం గమనార్హం. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మున్సీ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మెక్‌ లియోడ్‌ 25 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో జింబాబ్వే జట్టు గ్రూఫ్‌-బి టాపర్‌గా సూపర్‌-12లో భారత్ ఉన్న గ్రూప్-2లోకి వచ్చేసింది. వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఐర్లాండ్‌ బి2గా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు ఉన్న గ్రూప్-1లోకి అడుగుపెట్టింది.


Next Story
Share it