'నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది'.. టీమిండియా యువ ఓపెనర్
టెస్టు జట్టులో ఆడుతున్నప్పటికీ తన కలలు ఇంకా అలాగే ఉన్నాయని భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు.
By - Medi Samrat |
టెస్టు జట్టులో ఆడుతున్నప్పటికీ తన కలలు ఇంకా అలాగే ఉన్నాయని భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడి భారత్‌కు ఏదో ఒకరోజు కెప్టెన్‌గా నిలవాలన్నది తన కల అని అన్నాడు. ప్రస్తుతం ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారించానని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
2023లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ అద్భుతమైన టెస్ట్ కెరీర్‌తో దూసుకెళ్తున్నాడు. జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల తర్వాత కొత్త తరంలో ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగాడు. అయితే టీ20 టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం అతనికి ఇంకా రాలేదు. అయితే టీ20 ప్రపంచకప్ ఆడాలనేది అతని కల.
తాజాగా 'అజెండా ఆజ్ తక్ కాన్‌క్లేవ్'లో టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ ఆడాలనేది తన కల అని, అయితే తన ఆటపైనే దృష్టి సారించి సమయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు. నాకు అవకాశం వస్తే నేను కూడా భారత్‌కు కెప్టెన్‌గా ఉండాలనుకుంటున్నానని అన్నాడు.
T20 ప్రపంచ కప్ 2026కి ముందు.. భారత T20I జట్టు ఇప్పటికే చాలా సెట్‌గా ఉంది. అయితే వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. గత 16 టీ20ల్లో గిల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
ఇంకా మాట్లాడిన జైస్వాల్.. యశస్వి రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మైదానంలో రోహిత్ తిట్టినప్పుడు అందులో ప్రేమ, వినోదం రెండూ ఉంటాయని జైస్వాల్ చెప్పాడు. రోహిత్ తిట్టకపోతే అసౌకర్యానికి గురవుతాం. రోహిత్ భయ్యా తిట్టినప్పుడల్లా అందులో చాలా ప్రేమ ఉంటుంది. ఆయన తిట్టినా.. ఏమవుతుంది? అతడు చెప్పినదానికి నేను బాధపడ్డానా.? అంటూ గౌరవాన్ని చూపాడు.