Video : ఆరు రోజుల గ్యాప్‌తో పుట్టారు.. కానీ ఇద్ద‌రూ ఒకే రోజు వ‌న్డేల్లో ఎంట్రీ ఇచ్చారు..!

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

By Medi Samrat  Published on  6 Feb 2025 3:29 PM IST
Video : ఆరు రోజుల గ్యాప్‌తో పుట్టారు.. కానీ ఇద్ద‌రూ ఒకే రోజు వ‌న్డేల్లో ఎంట్రీ ఇచ్చారు..!

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డే నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మోకాలి సమస్య కారణంగా మొద‌టి వన్డేకు దూరమయ్యాడు. కుడి మోకాలి గాయం కారణంగా కోహ్లీ ఆడటం లేద‌ని కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా పేసర్ మహ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మొదటిసారి వన్డే క్రికెట్‌లోకి తిరిగి వ‌స్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేశారు. వీరికి మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ అరంగేట్రం క్యాప్‌లు అంద‌జేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. జట్టులోని ఆటగాళ్లందరూ యువకులిద్దరికీ జట్టులోకి స్వాగతం పలికారు. ఈ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టుతో కనిపించాడు. ఇందులో ఆటగాళ్లందరూ యశస్వి, హర్షిత్‌లకు చప్పట్లతో స్వాగతం పలికారు.

ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ భారతదేశం తరపున 19 టెస్ట్ మ్యాచ్‌లు, 23 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, హర్షిత్ రానా కేవలం రెండు టెస్టులు, ఒక T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లకు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

వీరిద్దరి వయస్సు 23 ఏళ్లు కాగా.. వీరిద్దరూ ఒకే మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. యశస్వి జైస్వాల్ వయస్సు 23 సంవత్సరాల 40 రోజులు (ప్రస్తుతం), హర్షిత్ రాణా వయస్సు 23 సంవత్సరాల 46 రోజులు కావ‌డం విశేషం.


Next Story