అందుకే గిల్‌ను తప్పించారు..!

2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

By -  Medi Samrat
Published on : 20 Dec 2025 7:50 PM IST

అందుకే గిల్‌ను తప్పించారు..!

2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్ జట్టులో చోటు దక్కింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టు వివరాలను వెల్లడించారు. గిల్‌ను తప్పించడంపై అగార్కర్ స్పందించారు. మేం సరైన కాంబినేషన్ కోసం చూస్తున్నాం.. టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. గిల్ ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు. కానీ, ఇది కేవలం జట్టు కూర్పులో భాగంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం గిల్ ఫామ్‌కు సంబంధించిన విషయం కాదని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. జట్టు కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. టాప్ ఆర్డర్‌లో కీపర్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో రింకూ లాంటి ఆటగాడు ఉండాలని భావించామని అన్నారు. జట్టు ఎంపిక పట్ల తాను సంతోషంగా ఉన్నానని, చాలా సమతూకంగా ఉందని తెలిపారు. టోర్నమెంట్ స్వదేశంలోనే జరుగుతున్నందున అవసరమైతే మార్పులు చేసే వెసులుబాటు ఉంటుందని, అందుకే స్టాండ్ బై ఆటగాళ్లను సెలెక్ట్ చేయలేదని బీసీసీఐ తెలిపింది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

Next Story