'మాకు ఆప్షన్ లేదు'.. సిరాజ్‌ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 18 Jan 2025 6:50 PM IST2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగి వచ్చాడు. అదే సమయంలో మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇదొక్కటే కాదు.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా మహ్మద్ సిరాజ్ ఎంపిక కాలేదు. విలేకరుల సమావేశంలో మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని రోహిత్ శర్మ వివరించాడు. సెలక్టర్లకు ఎలాంటి ఆప్షన్ లేదని చెప్పాడు. జట్టులో కొత్త బంతి, పాత బంతితో తన ప్రభావాన్ని చూపగల బౌలర్ కావాలని రోహిత్ అన్నాడు. మహ్మద్ సిరాజ్‌కు జట్టులో స్థానం దక్కకపోవడం దురదృష్టకరమని రోహిత్ శర్మ అన్నాడు. బంతి పాతదైతే సిరాజ్ ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నాడు. మాకు వేరే మార్గం లేదు.. కానీ కొత్త బంతితో బౌలింగ్ చేయగల, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో కూడా ప్రభావవంతంగా ఉండే ఆటగాళ్లను మేము కోరుకున్నాము.. బంతి పాతబడినప్పుడు మహమ్మద్ సిరాజ్ ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా టూర్‌లో మహ్మద్ సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్ 20 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అయినప్పటికీ.. సిరాజ్ తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.