ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు వైజాగ్ లో ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.?

ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది.

By Medi Samrat  Published on  22 Feb 2024 3:00 PM GMT
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు వైజాగ్ లో ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.?

ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ టోర్నీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి 15 రోజులకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల తేదీలను బట్టి మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లను వైజాగ్‌లో నిర్వహించనున్నారు. తొలి దశలో వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు (మార్చి 31, ఏప్రిల్ 3) జరుగనున్నాయి. వైజాగ్‌లో 2012 మొదలు ఇప్పటివరకూ 13 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్‌ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్‌ సెకెండ్‌ ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు అరుణ్‌ జైట్లీ స్టేడియంలో 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్‌ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు హోం గేమ్స్‌ను వైజాగ్ లో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో, ఏప్రిల్‌ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది.

Next Story