భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 8:00 PM IST

భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇండియా, వెస్టిండీస్ జట్లు చెరో 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారి, పూర్తిగా రద్దైతే. నిబంధనల ప్రకారం ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఇద్దరికీ 3 పాయింట్లు అవుతాయి. 'నెట్ రన్ రేట్' (NRR) ఆధారంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేస్తారు. ప్రస్తుతం వెస్టిండీస్ నెట్ రన్ రేట్ +1.791 గా ఉండగా.. భారత్ నెట్ రన్ రేట్ మైనస్ (-0.100) లో ఉంది. మ్యాచ్ గనుక వర్షం వల్ల రద్దైతే, మెరుగైన రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ జట్టు సెమీస్ చేరుకుంటుంది. భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Next Story