ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్‌లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు అని సన్‌రైజర్ ట్వీట్ చేసింది. కాగా.. గత సీజన్(ఐపీఎల్ 2022) నుంచి బ్రియాన్ లారా సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉండగా.. ప్రస్తుతం అతడిని హెచ్‌కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లు ఆడగా..కేవలం 6 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.