గబ్బాలో మ‌రోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్‌..!

బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా బలమైన కోట. ఈ మైదానంలో ఆతిథ్య జట్టును ఓడించడం చాలా కష్టం.

By Medi Samrat  Published on  13 Dec 2024 2:29 PM IST
గబ్బాలో మ‌రోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్‌..!

బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా బలమైన కోట. ఈ మైదానంలో ఆతిథ్య జట్టును ఓడించడం చాలా కష్టం. అయితే.. గ‌త ఆస్ట్రేలియన్ టూర్‌లో టీమ్ ఇండియా ఈ గడ్డపై గెలిచి ఆస్ట్రేలియా గర్వాన్ని బద్దలు కొట్టింది. మరోసారి అదే కథను రిపీట్ చేసేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ఈసారి గబ్బాలో ఆస్ట్రేలియాను భారత్ ఎలా ఓడించగలదో ఆ జట్టు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు.

ఈ గడ్డపై భారత్ గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాల్సి ఉందని గిల్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉందన్నదే ప్రస్తుతం టీమ్‌లో వినిపిస్తున్న చర్చ. వేలి గాయం కారణంగా గిల్ తొలి టెస్టు మ్యాచ్ ఆడలేదు. కానీ రెండో టెస్టు మ్యాచ్‌లో అతను జట్టులో భాగమయ్యాడు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శుభారంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు.

శుక్రవారం విలేకరుల సమావేశంలో గిల్ మాట్లాడుతూ.. "బ్యాటింగ్ గ్రూప్‌గా, మేము మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాలని చూస్తున్నాము. ఇది ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. ప్రతి బ్యాట్స్‌మెన్ తన స్వంత ప్రణాళికను కలిగి ఉంటాడు. ఇటీవలి కాలంలో భారత్ ఆరుసార్లు 150 దిగువకు పడిపోయింది. బ్యాటింగ్ గ్రూప్‌గా ఇంకా ఏమీ కోల్పోలేదని చెప్పాడు. అడిలైడ్ టెస్టులో మేం రాణించలేకపోయామని, అయితే ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉందని.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా చూస్తామని.. మెల్‌బోర్న్, సిడ్నీలకు వెళ్లేల‌పు ఆధిక్యం సాధిస్తామని అన్నాడు.

ఈరోజు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన‌లేదు. దీని గురించి గిల్‌ను అడిగగా.. "ఇది చిన్న‌పాటి సెషన్.. ఆయ‌న‌ ఇప్పటికే చాలా ప్రాక్టీస్ చేసాడు" అని చెప్పాడు. రోహిత్ శర్మ ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క అర్ధ సెంచరీ మినహా న్యూజిలాండ్ సిరీస్‌లో అతని బ్యాట్‌ నుండి మంచి ఇన్నింగ్స్‌లు లేవు. ఆ తర్వాత అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో కూడా రోహిత్ బ్యాట్ విఫ‌ల‌మైంది. గబ్బాలో రోహిత్ బాగా ఆడతాడని అంతా భావిస్తున్నారు.

Next Story