Video : ఫామ్‌ను తిరిగి పొందడానికి మాజీ కోచ్ దగ్గరికి వెళ్లిన కోహ్లీ.. 80 సెంచరీలు ఆయన ఉన్నప్పుడు చేసినవే..!
జనవరి 30న రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు.
By Medi Samrat
జనవరి 30న రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు. దీంతో అతడు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండాలని కేంద్ర కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లందరినీ బీసీసీఐ ఇటీవల ఆదేశించింది. 2012 తర్వాత కోహ్లీ ఏ రంజీ మ్యాచ్ ఆడలేదు. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ ఆటతీరు బాగాలేదు. కోహ్లీ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీని కారణంగా టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తు గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతులకు కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు. ఈ సాంకేతిక అంశాలపై పని చేయడానికి, కోహ్లి భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సహాయం తీసుకున్నాడు. కోహ్లీ ఆటపై బంగర్‌కు మంచి అవగాహన ఉంది. మెడ కండరాలు పట్టేయడంతో సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడలేకపోయిన కోహ్లి.. ఇప్పుడు బంగర్‌తో కలిసి ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో.. బంగర్ 16 గజాల దూరం నుండి కోహ్లీకి బంతిని విసిరాడు. అతడు బౌన్స్ అవుతున్న బంతులకు ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ బ్యాక్‌ఫుట్‌లో తన ఆటను మెరుగుపరుచుకోవాలనుకున్నాడు.. అందుకే సంజయ్ బంగర్ సహాయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Virat Kohli working with Sanjay Banger in Mumbai. 🙇♂️ pic.twitter.com/T4zEhC2D2f
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2025
బంగర్ టీం ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. బంగర్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు కోహ్లీ 80 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగర్ పదవీకాలం ముగిసిన తర్వాత కోహ్లీ కేవలం రెండు అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేశాడు. 2019 ప్రపంచకప్ తర్వాత బంగర్ పదవీకాలం ముగియడంతో విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు.
ఆ సమయంలో జట్టు సహాయక సిబ్బందిని నియమించిన వ్యక్తులలో ఉన్న బీసీసీఐ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ, "2019 ప్రపంచ కప్ తర్వాత బంగర్ గురించి కోహ్లీని అడిగినప్పుడు.. బంగర్ సమక్షంలో తాను బ్యాట్స్‌మెన్‌గా చాలా ప్రయోజనం పొందానని చెప్పాడు.