టీ20ల్లో కోహ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్
Virat Kohli opening at T20 World Cup is an option for us says Rohit.పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీని ఓపెనర్‌గా చూసే అవకాశం
By తోట వంశీ కుమార్ Published on 18 Sep 2022 11:13 AM GMTరోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్ 20) జరగనుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీని ఓపెనర్‌గా చూసే అవకాశం ఉందని చెప్పాడు.
"మాకు ఓపెనింగ్ కోసం జట్టులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాకు ఇది ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మా జట్టు ఆటగాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా అద్భుతంగా రాణించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ మెగా ఈవెంట్‌లో మేము బ్యాటింగ్‌లో ఆర్డర్‌లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. కోహ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. "అని రోహిత్ అన్నాడు.
"విరాట్ కోహ్లీ మా మూడో ఓపెనింగ్ ఆప్షన్. అతను కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను ఆడిన తీరుతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. అతని ప్రదర్శన గురించి పెద్దగా నోటీస్ కాలేదు. కానీ అతను మంచి ఓపెనర్. మాకు ముఖ్యమైన ఆటగాడు. మేం మా ఆలోచనా విధానంలో చాలా స్పష్టంగా ఉన్నాం. జట్టు పరంగా ఎలాంటి గందరగోళం లేదు. కేఎల్ రాహుల్ జట్టు కోసం ఎలాంటి రోల్ కనబర్చుతాడో అనే విషయమై కూడా మాకో స్పష్టత ఉంది." అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.