వైభవ్ సూర్య వంశీకి అదిరిపోయే అవకాశం
IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది.
By - Medi Samrat |
IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది. జూన్ 24 నుండి జూలై 23, 2025 వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత U-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. IPL 2025 సీజన్‌లో GTపై సెంచరీతో సహా తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు వైభవ్.
సూర్యవంశీతో పాటు, CSK ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా ఈ పర్యటనలో పాల్గొంటాడు. అంతేకాకుండా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారతదేశం ఈ పర్యటనను వార్మప్ గేమ్‌తో ప్రారంభిస్తుంది. ఇంగ్లాండ్ U-19తో ఐదు యూత్ ODIలు, రెండు మల్టీ-డే గేమ్‌లు ఆడుతుంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & కీపర్), హర్వాన్ష్ సింగ్ (కీపర్), R S అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహమ్మద్ ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్
స్టాండ్‌బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (WK).
U-19 ఇంగ్లాండ్ పర్యటన: షెడ్యూల్
50-ఓవర్ల వార్మప్ – 24 జూన్ – లౌబరో యూనివర్సిటీ
1వ వన్ డే – 27 జూన్ – హోవ్
2వ వన్ డే – 30 జూన్ – నార్తాంప్టన్
3వ వన్ డే – 2 జూలై – నార్తాంప్టన్
4వ వన్ డే – 5 జూలై – వోర్సెస్టర్
5వ వన్ డే – 7 జూలై – వోర్సెస్టర్
1వ మల్టీ డే – 12–15 జూలై – బెకెన్‌హామ్
2వ మల్టీ డే – 20–23 జూలై – చెల్మ్స్‌ఫోర్డ్