బుమ్రాను ఎలా ఎదుర్కొంటావు అంటే.. ఆ ఆస్ట్రేలియా యువ ఓపెన‌ర్ ఎమన్నాడంటే..

భారత్‌తో జరుగుతున్న చివరి రెండు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు తన జట్టులో మార్పులు చేసింది.

By Medi Samrat  Published on  23 Dec 2024 4:02 PM IST
బుమ్రాను ఎలా ఎదుర్కొంటావు అంటే.. ఆ ఆస్ట్రేలియా యువ ఓపెన‌ర్ ఎమన్నాడంటే..

భారత్‌తో జరుగుతున్న చివరి రెండు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు తన జట్టులో మార్పులు చేసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ పాత్ర పోషించిన నాథన్ మెక్‌స్వానీని తొలగించి.. అతని స్థానంలో 19 ఏళ్ల శామ్ కొంటాస్ ని తీసుకున్నారు. దీంతో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో కాన్‌స్టాస్ ఆడటం ఖాయంగా క‌న‌ప‌డుతుంది. జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాన్ని ఈ యువ ఆటగాడు ఎదుర్కోనున్నాడు. అయితే కొంటాస్ ఆందుకు భయపడకుండా బుమ్రాను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యాడు.

కాన్స్టాస్ పూర్తి విశ్వాసంతో బుమ్రాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ యువ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అంత అనుభవం లేదు. అతడు కేవలం 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బ్రిస్బేన్ టెస్టుకు ముందు కాన్ బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తరఫున టీమ్ ఇండియాతో తలపడి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఆత్మవిశ్వాసం చూసి అందరూ ప్రశంసలు కురిపించారు.

సోమవారం విలేకరుల సమావేశంలో కాన్స్టాస్ పాల్గొని బుమ్రా గురించి అడిగిన ప్రశ్నపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అతను ఇలా అన్నాడు, “బుమ్రా కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను మీకు ఇక్కడ చెప్పను. నేను బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడానికి ఇష్టపడే బ్యాట్స్‌మెన్‌ని. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరు, మంచి బౌలర్. నాకు షేన్ వాట్సన్ అంటే చాలా ఇష్టం. బౌలర్లపై ఎటాక్ చేయడం, ఒత్తిడి చేయడం ఇష్టం. షేన్ వాట్సన్ ఆటలో ఒక లెజెండ్.. ఈ వారం నేను అదే చేయగలనని ఆశిస్తున్నాను అని అన్నాడు

MCGలో కోన్‌స్టాస్ అరంగేట్రం చేయడం ఖాయం. అరంగేట్రం గురించి ఈ యువ బ్యాట్స్‌మెన్ ఇలా అన్నాడు, "నాకు ఇది సాధారణ రోజు లాంటిది. నా తల్లిదండ్రులు వస్తున్నందున కొంచెం ప్రత్యేకమైనది. కానీ ఇది చాలా సాధారణమైనది. నేను రోజు ఏమి చేస్తున్నానో అదే చేస్తాను అని అన్నాడు.

ఈ ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత 1-1తో సమంగా ఉంది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక నాలుగోదైన ఈ టెస్టు మ్యాచ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా భారత్‌కు కీలకం. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ సంప్రదాయం దృష్ట్యా ముఖ్యమైనది.

Next Story