రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన యూఏఈ కెప్టెన్..!

యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం ఆఫ్ఘనిస్థాన్‌పై తుఫాను హాఫ్ సెంచరీ సాధించి తన పేరిట ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో వసీం కేవలం 37 బంతుల్లోనే 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

By Medi Samrat
Published on : 2 Sept 2025 6:10 PM IST

రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన యూఏఈ కెప్టెన్..!

యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం ఆఫ్ఘనిస్థాన్‌పై తుఫాను హాఫ్ సెంచరీ సాధించి తన పేరిట ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో వసీం కేవలం 37 బంతుల్లోనే 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు.

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా మహ్మద్ వసీమ్ నిలిచాడు. త‌ద్వారా భారత టీ20 మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా వసీం 106 సిక్సర్లు బాదాడు. కాగా, రోహిత్ శర్మ 35 మ్యాచ్‌ల్లో 105 సిక్సర్లు బాదాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్లు వీరే..

106* - మహ్మద్ వాసిమ్ (UAE)

105 - రోహిత్ శర్మ (భారత్)

86 - ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)

82 - ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)

79 - కడోవాకి ఫ్లెమింగ్ (జపాన్)

69 - జోస్ బట్లర్ (ఇంగ్లండ్)

యూఏఈ తరఫున కెప్టెన్ మహ్మద్ వసీమ్ మంచి ఇన్నింగ్స్ ఆడినా.. 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో యూఏఈకి ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు పాక్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంత‌రం యూఏఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ వసీమ్ మినహా రాహుల్ చోప్రా అజేయంగా 52 పరుగులు చేశాడు.

Next Story