ఓటమి అంచున భారత్.. పంత్, నితీష్ రెడ్డి అద్భుతం చేస్తారా..?

అడిలైడ్ టెస్ట్ లో భారత్ పై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది.

By Medi Samrat  Published on  7 Dec 2024 6:15 PM IST
ఓటమి అంచున భారత్.. పంత్, నితీష్ రెడ్డి అద్భుతం చేస్తారా..?

అడిలైడ్ టెస్ట్ లో భారత్ పై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. స్టార్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోవడంతో భారత్ ఓటమి అంచున నిలుచుంది. పంత్ 28 పరుగులతో, నితీష్ రెడ్డి 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ 24, రాహుల్ 7, గిల్ 28, కోహ్లీ 11, రోహిత్ శర్మ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు 157 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. లబుషేన్ 64, ఓపెనర్ మెక్ స్వీనీ 39 పరుగులు చేశారు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 4, నితీశ్ కుమార్ రెడ్డి 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.

Next Story