19 ఏళ్లకే పూరన్ జీవితాన్ని కమ్మేసిన చీకట్లు.. కానీ, అతని కథ నేటి యువతకు స్ఫూర్తి..!
మరణానికి దగ్గరగా వెళ్లి తిరిగి పోరాడి నిలిచే వ్యక్తిని నిజమైన యోధుడు అంటారు.
By Medi Samrat
మరణానికి దగ్గరగా వెళ్లి తిరిగి పోరాడి నిలిచే వ్యక్తిని నిజమైన యోధుడు అంటారు. తీవ్రమైన ప్రమాదం లేదా గాయం తర్వాత తిరిగి వచ్చిన ఇలాంటి క్రికెటర్లు చాలా మంది క్రికెట్ ప్రపంచంలో కనిపిస్తారు. అప్పుడు వారి కథ సజీవ ఉదాహరణగా మారింది. సోమవారం రాత్రి 29 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ది కూడా అలాంటి కథే.
పూరన్ టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. మైదానంలో సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిఓయిన పురాన్ జీవితంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి.
పూరన్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. ఆ తర్వాత అతని కెరీర్ ముగిసినట్లే అనిపించినా, ధైర్యం కోల్పోకుండా తన అచంచలమైన ధైర్యం, కృషితో మృత్యువును ఓడించడమే కాకుండా క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
జనవరి 2015లో నికోలస్ పూరన్ 19 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు.. అతను ట్రినిడాడ్‌లోని సెయింట్ మేరీస్‌లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత అతని మోకాలి, చీలమండకు తీవ్ర గాయాలయ్యాయి. దాని కోసం అతను అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. డాక్టర్లు కూడా ధైర్యం కోల్పోయి మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉందా అని సందేహించే సమయం వచ్చింది. చాలా కాలం పాటు పూరన్ వీల్ చైర్‌కే పరిమితమై, మళ్లీ నడవడానికి నెలల తరబడి కఠిన పునరావాసం పొందాల్సి వచ్చింది. కానీ అతని కృషి, ఎప్పటికీ వదిలిపెట్టని అతని వైఖరి అన్ని ఇబ్బందులను అధిగమించింది. అతను మైదానంలో పునరాగమనం చేయడమే కాకుండా ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
పూరన్ కూడా ఈ ప్రమాదం గురించి పలుమార్లు చెప్పాడు.. తన జీవితంలో ఆ 6 నెలలు అత్యంత కష్టతరమైనవని, అయితే ఈ కాలం అతన్ని మంచి వ్యక్తిగా మార్చిందని పేర్కొన్నాడు. సక్సెస్‌లను ఎంత ఓపికతో తీసుకున్నానో, అదే ఓపికతో అపజయాలను ఎదుర్కోవడం నేర్చుకున్నాను అని చెప్పాడు. జీవితంలో దేన్నీ పెద్దగా తీసుకోకూడదని నేర్చుకున్నాను. ఈ అనుభవం నా గర్ల్‌ఫ్రెండ్ అలిస్సా (తర్వాత వివాహం చేసుకున్న) మరింత విలువైనదిగా నాకు నేర్పిందన్నాడు.
దీని తరువాత పూరన్ పునరావాసం పొందాడు. క్రికెట్ మైదానంలోకి అద్భుతమైన పునరాగమనం చేయడం ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తన కాళ్లపై తాను నిలబడలేని పూరన్.. ధైర్యం ఉంటే అన్నీ సాధ్యమేనని నిరూపించాడు. ఆయన కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది.
నికోలస్ పూరన్ భార్య పేరు మిగ్యుల్ కేథరీన్. ఆమె అతని చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరూ పాఠశాల రోజుల్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ క్షణం నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు. 6 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వారు 2020 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు.