ఓర్లీన్స్ ఛాలెంజర్ టోర్నమెంట్‌లో రౌండ్-16 మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు కొరెంటిన్ మౌటెట్, బల్గేరియాకు చెందిన అడ్రియన్ ఆండ్రీవ్ కొట్టుకోవడం వివాదాస్పదమైంది. ప్రపంచ 247వ ర్యాంకర్ ఆండ్రీవ్ 2-6 7-6 (7-3) 7-6 (7-2)తో టాప్ సీడ్ మౌటెట్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ సమయంలో మౌటెట్, ఆండ్రీవ్ తిట్టుకుంటూ కనిపించారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొని.. కొట్టుకునేదాకా వెళ్ళింది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో మౌటెట్ తొలుత బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత ఆండ్రీవ్‌ను బూతులు తిట్టాడు. ఇది ఊహించని ఆండ్రీవ్ మౌటెట్‌కు ఎదురెళ్లాడు. గొడవ పెద్దగా మారుతుందన్న తరుణంలో చైర్ అంపైర్ వచ్చి ఇద్దరికి సర్థిచెప్పాడు. దీంతో ఆండ్రీవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
"I wish to make no apologies for what happened late in the game. When a player says "f*** you", twice while looking at me in the eye, I can't help but make him understand in my own way that that is not done," అంటూ మౌటెట్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ తర్వాత నేను చేసింది తప్పే కావొచ్చు. కానీ ఎవరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు మౌటెట్.