పాక్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ
Teamindia Beat Pakisthan. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
By Medi Samrat
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మ్యాచ్ ఫలితంపై చివరి ఓవర్ వరకూ నరాలు తెగిపోయేంత ఉత్కంఠ నెలకొంది. అయితే మ్యాచ్‌లో చివరి బంతికి విజయం భారత్ వశమైంది. వివరాళ్లోకెళితే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 160 లక్ష్యంతో చేధనకు దిగిన భారత్ కు ఆదిలోనే కష్టాలు మొదలయమ్యాయి. ఏడు పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ కాగా, ఆ తర్వాత మూడు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే.. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఇరువురు 100 పరుగులకు పైగా బాగస్వామ్యం నమోదుచేశారు. ముఖ్యంగా కోహ్లీ(82) అర్ధసెంచరీ వరకు నిదానంగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచాడు. హార్దిక్ పాండ్యా(40) పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ఉన్నంత సేపు ఆచితూచి ఆడుతూ కోహ్లీకి సహకరించాడు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌పై ఆశలు నిలిపాడు. చివరి బంతికి అశ్విన్ పోర్ కొట్టి లాంఛనాన్ని పూర్తి చేశాడు.