స్టార్ట్ చేశారు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!

T20 ప్రపంచ కప్-2024కు జూన్ 1 నుండి వెస్టిండీస్‍-అమెరికా ఆతిథ్యమివ్వనునున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అమెరికా చేరుకుంది.

By Medi Samrat  Published on  29 May 2024 3:09 PM IST
స్టార్ట్ చేశారు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!

T20 ప్రపంచ కప్-2024కు జూన్ 1 నుండి వెస్టిండీస్‍-అమెరికా ఆతిథ్యమివ్వనునున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అమెరికా చేరుకుంది. న్యూయార్క్ చేరుకున్న తర్వాత భారత జట్టు ప్రాక్టీసు సెష‌న్‌ను ప్రారంభించింది. BCCI తన X (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియోను పంచుకుంది, దీనిలో టీం ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆటగాళ్లు ఏకధాటిగా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తున్నారు. స్టార్ ఆల్ రౌండర్, ప్రపంచకప్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులోకి వచ్చాడు.

BCCI T20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ వీడియోను షేర్ చేసింది, ఇందులో ఆటగాళ్లు మైదానంలో జాగింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో జస్ప్రీత్ బుమ్రా మేము క్రికెట్ ఆడటానికి ఇక్కడకు రాలేదని.. టీమ్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చామని చెప్పడం కనిపిస్తుంది. జట్టులో చేరిన వైరల్ వీడియోలో హార్దిక్ పాండ్యా కూడా కనిపించాడు. హార్దిక్ టీమ్‌లో చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లు న్యూయార్క్‌లో తొలిసారి క్రికెట్ ఆడడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ మంచి ఆటను కనబరుస్తామని ఆశిస్తున్నామ‌న్నారు.

జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈసారి భారత జట్టు ఒకే ఒక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో టీమ్ ఇండియా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆడడం ద్వారా టోర్నీని ప్రారంభించనుంది.

T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్.

రిజర్వ్: శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్, అవేష్ ఖాన్.

Next Story