సూపర్ బౌలర్.. సూర్య కుమార్ యాదవ్!!

సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం తెలిసిందే. ఇక ఫీల్డింగ్ లో కూడా అతడు చేసే అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By అంజి  Published on  31 July 2024 1:15 PM IST
T20I, Suryakumar Yadav, Sri Lanka, BCCI, SLvIND, TeamIndia

సూపర్ బౌలర్.. సూర్య కుమార్ యాదవ్!! 

సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం తెలిసిందే. ఇక ఫీల్డింగ్ లో కూడా అతడు చేసే అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బౌలింగ్ తో కూడా మ్యాచ్ ను గెలిపించగలడని తెలుసా? అత్యంత అరుదుగా సూర్య కుమార్ బౌలింగ్ వేస్తుండడం చూస్తూ ఉంటాం.. ఏకంగా మ్యాచ్ టై అయ్యేలా చేశాడు సూర్య కుమార్ యాదవ్.

శ్రీలంకతో జరిగిన మూడో T20I సిరీస్ కోసం భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. అద్భుతమైన లాస్ట్ ఓవర్ వేశాడు. పల్లెకెలెలో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌లోకి తీసుకెళ్లాడు. శ్రీలంక బాగా బౌలింగ్ చేసి భారత్‌ను 137/9కి పరిమితం చేసింది.ఇక ఛేజింగ్ లో ఆతిథ్య జట్టు 129/4తో విజయానికి అతి దగ్గరగా ఉంది.. చివరి 2 ఓవర్లలో 9 పరుగులు కావాల్సి ఉండగా, సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్‌ను బౌలింగ్ లోకి తీసుకువచ్చాడు .

తన ఓవర్‌లో కేవలం 3 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి రింకూ అద్భుతం చేశాడు. శ్రీలంక తరపున చివరి ఓవర్‌లో ఇద్దరు కొత్త బ్యాటర్‌లు క్రీజులోకి వచ్చారు. విజయానికి 6 పరుగులు అవసరం అయ్యాయి. ఇండియా స్లో ఓవర్-రేట్ కారణంగా.. 30-యార్డ్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్‌లను మాత్రమే అనుమతించారు. మొహమ్మద్ సిరాజ్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తాడని భావించగా.. సూర్యకుమార్ యాదవ్ చివరి నిమిషంలో ఆఫ్-బ్రేక్‌లను బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చాడు.

మొదటి బంతిని సూర్య కుమార్ యాదవ్ డాట్ బాల్ వేశాడు. ఆ తర్వాత బంతిని సూర్య వికెట్ తీసుకున్నాడు. తన తొలి T20I వికెట్‌ని పడగొట్టాడు. కమిందు మెండిస్‌ రెండవ బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేసి రింకు సింగ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్య 86కి.మీ వేగంతో బౌలింగ్ వేయగా.. మెండిస్ రివర్స్-స్లాగ్‌ షాట్ ఆడాడు. బంతి నేరుగా థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న రింకు సింగ్ చేతిలో పడింది.

ఆ తర్వాతి బంతికి కూడా సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. మహీష తీక్షణ మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. లెగ్ సైడ్ కొట్టాలని ప్రయత్నించగా.. సంజు శాంసన్‌కి క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో ఇండియా రివ్యూ తీసుకుంది. రీప్లే లో బంతి గ్లోవ్‌ను తాకినట్లు తేలింది. ఇక అసిత ఫెర్నాండో హ్యాట్రిక్ బాల్‌లో ఒక పరుగు తీసుకోగా.. మ్యాచ్ సమీకరణాన్ని 2 బంతుల్లో 5 పరుగులకు తగ్గించాడు.

చమిందు విక్రమసింఘే ఆ తర్వాత బంతికి 2 పరుగులు చేసి సమీకరణాన్ని 1 బంతికి 3 పరుగులకు తగ్గించాడు. సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎండ్ లో ఉన్న స్టంప్‌లను విసిరి ఉండి ఉంటే.. అసిత ఫెర్నాండో రనౌట్ అయ్యి ఉండేవాడు. కానీ బంతిని విక్రమసింఘే వైపు కీపర్‌కి విసిరాడు. ఇక చివరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా.. విక్రమసింఘే మళ్లీ 2 పరుగులు సాధించాడు. లాంగ్-ఆన్ నుండి త్రో బౌలర్ ఎండ్‌కి చేరుకుంది. ఈసారి సూర్యకుమార్ దానిని క్లీన్‌గా తీసుకోలేకపోవడంతో రెండు పరుగులు వచ్చాయి.. మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్ళింది. ఎంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ను శ్రీలంక సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుంది. ఇక సూపర్ ఓవర్ లో టీమిండియా ఎలాంటి పొరపాటు చేయకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.

Next Story