టీ20 ప్రపంచకప్ కు వచ్చే విండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లివే..!

T20 World Cup Teams Announced. టీ20 ప్రపంచకప్ కు పలు క్రికెట్ బోర్డులను జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. టీ20

By Medi Samrat  Published on  10 Sep 2021 6:05 AM GMT
టీ20 ప్రపంచకప్ కు వచ్చే విండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లివే..!

టీ20 ప్రపంచకప్ కు పలు క్రికెట్ బోర్డులను జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు విండీస్ తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. విండీస్‌ జట్టుకు కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. నికోలస్‌ పూరన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. క్రిస్‌ గేల్‌, లెండి సిమన్స్‌, హెట్‌మైర్‌, రోస్టన్‌ చేజ్‌ హిట్టింగ్ విండీస్ కు ప్లస్ గా మారనుంది. ఇక డ్వేన్‌ బ్రేవో, ఆండ్రీ రసెల్‌, ఫాబియన్‌ అలెన్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. విండీస్‌ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది.

విండీస్‌ టీ20 జట్టు:

కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్

దక్షిణాఫ్రికా:

టీ20 ప్రపంచకప్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. తెంబ బవుమా సారథ్యంలో15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరీస్‌,ఇమ్రాన్ తాహీర్‌లకు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహీర్‌ ప్రస్తుతం కరీబీయన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్.

రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్

ఇంగ్లండ్:

ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా మోర్గాన్ వ్యవహరించనున్నాడు. బెన్ స్టోక్స్‌, టెస్ట్ కెప్టెన్ జో రూట్‌లకు సెలెక్షన్‌ కమిటీ అవకాశం ఇవ్వలేదు.

ఇక మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స్టోక్స్‌ క్రికెట్ నుంచి నిర‌వ‌ధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్‌ సెలెక్షన్‌ కమిటీ అతడిని వద్దనుకుంది. జోఫ్రా ఆర్చ‌ర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమ‌ల్ మిల్స్‌, ఆల్‌రౌండర్‌ కోటాలో క్రిస్‌ వోక్స్‌ జట్టులోకి వచ్చారు.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ క‌ర్రన్‌, క్రిస్ జోర్డాన్‌, లియామ్ లివింగ్‌స్టోన్‌, డేవిడ్ మ‌లాన్‌, టైమ‌ల్ మిల్స్‌, ఆదిల్ ర‌షీద్‌, జేసన్ రాయ్‌, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్‌, మార్క్ వుడ్‌.


Next Story
Share it