టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ప్రకటన

T20 World Cup Squad Announced. టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది.

By Medi Samrat
Published on : 12 Sept 2022 6:07 PM IST

టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ప్రారంభం కానుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ లకు బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లకు జట్టులో చోటు కల్పించారు. గాయంతో రవీంద్ర జడేజా దూరమయ్యాడు. యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా తమ స్థానాలను నిలుపుకున్నారు. ఆసియా కప్ కు దూరమైన బుమ్రా భారత జట్టులోకి రావడం విశేషం. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది. అక్టోబరు 23న జరిగే ఈ మ్యాచ్ కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది

భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.

స్టాండ్ బై ఆటగాళ్లు :

మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.


Next Story