భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు ఖాతా కూడా తెరవలేదు. ఆరు మ్యాచ్‌ల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా అతని బ్యాట్ నుండి పరుగులు లేవు. ఈ స్టార్ స్ట్రైకర్ బ్యాట్ ఝళిపించకపోవడంతో ముంబై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఐనా.. సూర్య అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐసీసీ బుధవారం తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేడు. అయినా యాదవ్ ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ర్యాకింగ్స్‌లో సూర్య 906 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (811 పాయింట్లు), కెప్టెన్ బాబర్ అజామ్ (755 పాయింట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్‌రామ్ (748 పాయింట్లు), న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే (745 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 15వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో సూర్యకుమార్ మొదటి మూడు గేమ్‌లలో 15, 1, సున్నా పరుగులకే అవుటయ్యాడు. మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభం కానున్న పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బాబర్ ఆజం.. సూర్యకుమార్ యాదవ్‌కు చేరువయ్యే అవకాశం లభించనుంది.