ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభసిమ్రాన్ సింగ్ 42 పరుగులు, ప్రియాంష్ ఆర్య 36 పరుగులు, మార్కస్ స్టోయినిస్ అజేయంగా 34 పరుగులు చేశారు.
హోం గ్రౌండ్‌లో ఆడుతున్న హైదరాబాద్ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్‌లో వెనుదిరిగింది. పాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 1 గెలిచింది. కాగా, గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.