మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. హైదరాబాద్ జట్టుకు పాట్ కమ్మిన్స్ నాయకత్వం వహిస్తాడు.
గత సీజన్‌లో సన్‌రైజర్స్ దూకుడుగా బ్యాటింగ్ ఆడి సంచలనం సృష్టించింది. మూడుసార్లు 250 పరుగులు దాటించింది. వాటిలో రెండు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లు. కమ్మిన్స్ నాయకత్వంలోని జట్టు దూకుడుగా ఉండే గుర్తింపును సంపాదించుకుంది.
SRH ప్రాక్టీస్ మ్యాచ్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించే ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అవుతూ ఉంది. ఆ జట్టు కేవలం 19 ఓవర్లలో 400 పరుగులు చేసిందని, ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో సెంచరీ చేశాడని అందులో ఉంది. "ట్రావిస్ హెడ్ కేవలం 19 బంతుల్లో 100 పరుగులు చేశాడు" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన రీల్‌లో "SRH బ్యాటర్లు ఈసారి 400 పరుగులు దాటడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు" అనే ఓవర్‌లే టెక్స్ట్ ఉంది.
వైరల్ వీడియోలోని స్కోర్ బోర్డులో SRH-A at 401/7 in 19.4 overs అని ఉంది. T. Head at 100* (19) I Kishan at 50 (12) అని ఉంది. SRH-B’ బౌలర్ H Patel 17 పరుగులను 0.4 ఓవర్లలో కొట్టించుకున్నట్లుగా ఉంది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వీడియోలో చూపించిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కనిపించలేదు. స్క్రీన్‌షాట్ తీసిన సమయంలో అసలు స్కోరు 5.4 ఓవర్లలో 104/2 అని ఉంది.
కీవర్డ్ శోధనలో సన్ రైజర్స్ అధికారిక YouTube ఛానెల్ " ‘Intra-squad Match Simulation 1 | Sunrisers Hyderabad | IPL 2025,’ అనే టైటిల్ తో మార్చి 15, 2025న వీడియోను అప్లోడ్ చేసారు.
నాలుగు గంటల నిడివి గల వీడియోను క్షుణ్ణంగా పరిశీలించగా, SRH మ్యాచ్ లో ఎక్కడ కూడా 400 పరుగులు దాటలేదని, ట్రావిస్ హెడ్ ఆడలేదని తేలింది. ఫుటేజీని నిశితంగా విశ్లేషించడం ద్వారా, వైరల్ స్క్రీన్‌షాట్ 01:30:09 గంటలకు టైమ్ స్టాంప్ వద్ద - 01:30:09 మార్క్ వద్ద తీసిన స్క్రీన్ షాట్ ను మేము గుర్తించాము. మ్యాచ్ ముగిసే సమయానికి స్కోరు 260/10.
అసలు వీడియోలోని స్కోర్‌బోర్డ్ వైరల్ పోస్ట్‌లోని స్కోరు బోర్డుతో సరిపోలలేదు.
వైరల్ వీడియో స్క్రీన్‌షాట్, అధికారిక మ్యాచ్ స్క్రీన్‌షాట్ మధ్య పోలిక ఇక్కడ ఉంది.
వైరల్ స్క్రీన్‌షాట్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మమ్మల్ని మార్చి 16, 2025 నాటి Cricspirit.com ఫేస్‌బుక్‌లో చేసిన అసలు పోస్ట్‌కి దారితీసింది, ఇది సరైన మ్యాచ్ స్కోర్‌ను ప్రదర్శించింది.
పోలికలు ఇక్కడ చూడొచ్చు
ఈ వైరల్ పోస్ట్‌ను ఒరిజినల్ పోస్ట్ నుండి ఎడిట్ చేసి ఫేక్ న్యూస్ ను సృష్టించారు. రెండు వెర్షన్‌లను పోల్చి చూస్తే స్కోరుబోర్డును ఎడిట్ చేశారని నిర్ధారించాము.
కాబట్టి, SRH ప్రాక్టీస్ సెషన్‌లో 400+ పరుగుల స్కోరు దాటిందనే వాదనలో నిజం లేదు. వైరల్ వీడియోలోని స్కోరుబోర్డును ఎడిట్ చేశారు.
Credit : M Ramesh Naik