రెచ్చిపోయిన అసలంక, రాజపక్స.. బంగ్లాపై లంక ఘన విజయం
Srilanka Beat Bangladesh In t20 World Cup. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి
By Medi Samrat
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, బినుర ఫెర్నాండో, లహీరు కుమార తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు అసలంక(80), భానుక రాజపక్స(53) రాణించడంతో ఈజీ విక్టరీ నమోదు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మొదట్లో తడబడింది. తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో బిగ్ హిట్టర్ కుశాల్ పెరీరా(3 బంతుల్లో 1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక 2 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ఇన్నింగ్స్ 9వ ఓవర్ బౌల్ చేసిన షకీబ్ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకకు దెబ్బ కొట్టాడు. తొలి బంతికి నిస్సంక(21 బంతుల్లో 24; ఫోర్, సిక్స్)ను క్లీన్ బౌల్డ్ చేసిన షకీబ్.. నాలుగో బంతికి అవిష్క ఫెర్నాండోను సైతం క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అనంతరం 10వ ఓవర్ నాలుగో బంతికి హసరంగ(5 బంతుల్లో 6; ఫోర్) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న అసలంక(49 బంతుల్లో 80; 5 ఫోర్లు, 5 సిక్సర్లు ) కు భానుక రాజపక్స(31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో శ్రీలంక విక్టరీ మోగించింది.