పెళ్లి చేసుకున్న ఆర్సీబీ స్టార్

Sri Lankan cricketer Wanindu Hasaranga gets married. శ్రీలంక క్రికెటర్ వహిందు హసరంగా తన స్నేహితురాలు వింద్యను పెళ్లి చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  10 March 2023 7:17 PM IST
పెళ్లి చేసుకున్న ఆర్సీబీ స్టార్

Wanindu Hasaranga


శ్రీలంక క్రికెటర్ వ‌నిందు హసరంగా తన స్నేహితురాలు వింద్యను పెళ్లి చేసుకున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ తన లేడీ లవ్‌తో మార్చి 9న శ్రీలంకలో వివాహం చేసుకున్నాడు. తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని తెలిపాడు. హసరంగా తన పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నాడు. అతని వివాహ వేడుక శ్రీలంకలోని వాటర్స్ ఎడ్జ్ హోటల్‌లో జరిగింది. అతని భార్య వింద్య గురించి పెద్దగా ఏమీ తెలియదు. చాలా వరకూ హసరంగా తన రిలేషన్ షిప్ ను దాచేసి ఉంచాడు.

వనిందు హసరంగా 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంక జట్టుకు అరంగేట్రం చేశాడు. భారత్‌పై శ్రీలంక సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించి ఒక్కసారిగా అతను స్టార్ గా మారాడు. 2021లో అతను ప్రపంచంలోనే నంబర్ 1 ర్యాంక్ T20 బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హసరంగా 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాపై శ్రీలంక విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.


Next Story