టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్ కూడా శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడతామంటూ చెప్పగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిరాకరించింది. చివరికి బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ.
ఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా స్పందించింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలని లంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే అన్నారు. మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్ కుమార గమేజ్ తెలిపారు.