క్రికెట్ ప్రేమికుల‌కు గుడ్‌న్యూస్‌.. ప్రేక్ష‌కుల మ‌ధ్యే భార‌త్‌-ఆస్ట్రేలియా సిరీస్‌

Spectators to return in India vs Australia series. క్రికెట్ అభిమానుల‌కు నిజంగా శుభవార్త ఇది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా

By Medi Samrat  Published on  21 Nov 2020 6:43 AM GMT
క్రికెట్ ప్రేమికుల‌కు గుడ్‌న్యూస్‌.. ప్రేక్ష‌కుల మ‌ధ్యే భార‌త్‌-ఆస్ట్రేలియా సిరీస్‌

క్రికెట్ అభిమానుల‌కు నిజంగా శుభవార్త ఇది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇన్ని రోజులు అభిమానుల‌ను మైదానంలో అనుమ‌తించని విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ సిరీస్‌ల‌తో పాటు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) వంటి మెగా టోర్నీ జ‌రిగినా ప్రేక్ష‌కుల‌ను అనుమతించలేదు. ఐపీఎల్‌లో అభిమానులు లేని లోటుని కృత్రిమ సౌండ్ల‌తో భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. కాగా.. ఇక నుంచి ఆ అవ‌స‌రం అక్క‌ర‌లేదు.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌కు పరిమిత సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్ర‌క‌టించింది. అంతేనా.. మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల‌కు సంబంధించిన టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో ఉంచ‌గా అవ‌న్నీ హాట్‌కేకుల్లా అమ్ముడ‌య్యాయ‌ని వెల్ల‌డించింది. కాగా.. తొలి వ‌న్డేకు మాత్రం 2 వేల కంటే త‌క్కువ టిక్కెట్లు మిగిలాయ‌ని.. అవి కూడా త్వ‌ర‌లోనే అమ్ముడుపోతాయ‌ని వెల్ల‌డించింది.

కాన్‌బెర్రా, సిడ్నీ స్టేడియాల్లోనూ కరోనా మహమ్మారి నిబంధ‌న‌ల కార‌ణంగా 50% టిక్కెట్లు మాత్ర‌మే అమ్మ‌కానికి ఉంచారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో కరోనా అదుపులోనే ఉంది. త్వరలోనే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. ద‌క్షిణాసియా ప్రాంత ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే ఆస్ట్రేలియాలో టీమిండియా ఎప్పుడు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా.. టిక్కెట్ల‌న్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. ఇండియాతో సిరీస్ అంటేనే క్రికెట్ ఆస్ట్రేలియాపై కాసుల వ‌ర్షం కురుస్తోంది.

భార‌త్‌-ఆసీస్ మ‌ధ్య మ్యాచ్ అంటేనే ప్ర‌పంచంలోనే అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన పోటీ. ఈ సిరీస్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ఆశిస్తున్నా అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌తినిధి ఆంథోని తెలిపారు. దాదాపు మూడు నెల‌ల పాటు సాగ‌నున్న ఈ సుదీర్ఘ ప‌ర్య‌ట‌లో భార‌త జ‌ట్టు ఆసీస్‌తో మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో త‌ల‌ప‌డ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్‌య సిడ్నీ వేదిక‌గా న‌వంబ‌ర్ 27న తొలి వ‌న్డేతో ఈ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది.




Next Story