ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By - Medi Samrat |
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, భారత్ ముందు 548 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 14, రాహుల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. చివరి రోజు ఆటలో భారత జట్టు విజయానికి 522 పరుగులు, దక్షిణాఫ్రికా జట్టుకు 8 వికెట్లు కావాలి
దక్షిణాఫ్రికా నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా టోనీ డి జోర్జి (49), చివర్లో వియాన్ ముల్డర్ (35 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే 4 వికెట్లతో ప్రభావం చూపగలిగాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.