మరో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భారతజట్టు చేతిలో ఓటమిని ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టుకు దక్షిణాఫ్రికా తో సిరీస్ లో మరో ఓటమి ఎదురైంది.

By -  Medi Samrat
Published on : 15 March 2026 6:05 PM IST

మరో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భారతజట్టు చేతిలో ఓటమిని ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టుకు దక్షిణాఫ్రికా తో సిరీస్ లో మరో ఓటమి ఎదురైంది. మొదటి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ కేవలం 91 పరుగులకు ఆలౌట్ అవ్వగా సౌత్ ఆఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ కేవలం 91 పరుగులకు ఆలౌట్ అయింది. జేమ్స్ నీశమ్ చేసిన 26 పరుగులే టాప్ స్కోర్. ఇక ఛేజింగ్ లో తీరిగ్గా ఆడారు సఫారీలు. 17వ ఓవర్లో టార్గెట్ ను ఛేజ్ చేశారు. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టీ20 మార్చి 17న జరగనుంది.

Next Story