ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన‌ దక్షిణాఫ్రికా.. టీమ్‌లోకి ఇద్దరు ప్రమాదకరమైన బౌలర్లు ఎంట్రీ

వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

By Medi Samrat  Published on  13 Jan 2025 2:08 PM IST
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన‌ దక్షిణాఫ్రికా.. టీమ్‌లోకి ఇద్దరు ప్రమాదకరమైన బౌలర్లు ఎంట్రీ

వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ టెంబా బావుమా చేతిలో ఉంది. చాలా కాలంగా జట్టుకు దూరమైన ఇద్దరు పాస్ట్‌ బౌలర్లను సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఇప్పటి వరకు ఏ ఐసీసీ టోర్నీని గెలవలేదు. ఈ జట్టు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినా.. భారత్‌ చేతిలో ఓడిపోయింది. టెంబా బావుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఈసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక్కడ ఆస్ట్రేలియాతో తలపడనుంది. దీనికి ముందు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని దక్షిణాఫ్రికా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం క్రికెట్ సౌతాఫ్రికా అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు ప్రయత్నించింది. ఇద్దరు ఆటగాళ్ల రాకతో జట్టు బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న ఎన్రిక్ నోర్కియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి వచ్చాడు.

సెప్టెంబరు-2023 తర్వాత నోకియా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రాక్చర్ కారణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఈ కారణంగా ODI ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. అతడితో పాటు లుంగీ ఎన్‌గిడి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు అక్టోబర్-2024 నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు. వీరిద్దరి రాక జట్టు బౌలింగ్‌కు బలం చేకూర్చింది. వీరిద్దరూ కాకుండా జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు మార్కో జాన్సెన్, మ‌రో స్పీడ్‌స్ట‌ర్‌ కగిసో రబాడ ఉన్నారు.

టోనీ డిజార్జ్, ర్యాన్ రికిల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్డర్ ODI ఫార్మాట్‌లో ICC ఈవెంట్ కోసం మొదటిసారిగా జట్టులోకి ఎంపికయ్యారు. 2023లో వన్డే ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టులోని ఆటగాళ్లలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా జట్టు:-

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డిజార్జ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగీ న్గిడి, ఎన్రిక్ నోర్కియా, కగిసో రబడ, ర్యాన్ రికిల్టన్, తబ్రైజ్ షంబ్సి, ట్రిస్టన్ స్టివాన్‌సి, ట్రిస్టాన్ స్టివాన్‌సి.

Next Story