సర్ఫరాజ్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఎందుకు త‌ప్పించిందో చెప్పిన గంగూలీ

ఇటీవలే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

By Medi Samrat  Published on  2 March 2024 8:15 PM IST
సర్ఫరాజ్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఎందుకు త‌ప్పించిందో చెప్పిన గంగూలీ

ఇటీవలే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అరంగేట్రం టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేయడం ద్వారా సర్ఫరాజ్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024లో సర్ఫరాజ్ త‌న స‌త్తా చాటే అవ‌కాశం లేదు.

ఎందుకంటే.. ఈ వేలంలో సర్ఫరాజ్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని జట్టు నుండి విడుదల చేసింది. ఢిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సర్ఫరాజ్‌ను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.

సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "సర్ఫరాజ్ టెస్టు ఆటగాడు అని నేను అనుకుంటున్నాను. అతని ఆట ఆ ఫార్మాట్‌కు బాగా సరిపోతుంది. T-20 విభిన్న ఫార్మాట్. అతడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సాధించిన పరుగుల సంఖ్య అద్భుతమైనది.

సర్ఫరాజ్ ఖాన్ 2015 సంవత్సరంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అతడు లీగ్‌లో ఇప్పటి వరకు మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. 130.58 స్ట్రైక్ రేట్‌తో 585 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సర్ఫరాజ్ సగటు 22.50 మాత్రమే. ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. గత సీజన్‌లో సర్ఫరాజ్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో మాత్ర‌మే ఆడే అవకాశం లభించింది. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 85.48 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు మాత్రమే చేశాడు.

Next Story