భార్య, గర్ల్ ఫ్రెండ్స్.. విరాట్ కోహ్లీపై గంగూలీ కామెంట్స్
Sourav Ganguly makes a big statement on Indian Test captain. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత టెస్టు కెప్టెన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
By Medi Samrat Published on 19 Dec 2021 1:14 PM GMTబీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత టెస్టు కెప్టెన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. జాతీయ క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలగించడంతో ఇదంతా మొదలైంది. కోహ్లీని కెప్టెన్సీ నుండి తొలగించినప్పుడు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, BCCI అధ్యక్షుడు లేదా బోర్డు కార్యదర్శి జే షా నుండి ఎటువంటి ప్రకటనలు లేవు. కొన్ని రోజుల తర్వాత, గంగూలీ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, T20I కెప్టెన్సీ పదవి నుండి వైదొలగవద్దని తాను కోహ్లీని కోరానని, అయితే కెప్టెన్‌గా కొనసాగకూడదని కోహ్లీ అప్పటికే ఫిక్స్ అయ్యాడని చెప్పాడు. వన్డేలు, టీ20లకు ఇద్దరు కెప్టెన్లు ఉండేందుకు సెలక్టర్లు అనుకూలంగా లేరని గంగూలీ పేర్కొన్నాడు. కోహ్లి, దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు, మీడియాతో మాట్లాడుతూ, కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు పెట్టాలని సెలక్టర్లు పిలుపునిచ్చే ముందు బీసీసీఐ నుండి ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత గంగూలీ ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు.
ఇక గుర్గావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గంగూలీకి ఏ క్రికెటర్ వైఖరి చాలా ఇష్టం అని అడిగారు. దానికి గంగూలీ మాట్లాడుతూ "నాకు విరాట్ కోహ్లీ వైఖరి ఇష్టం కానీ అతను చాలా పోరాడతాడు." అని అన్నాడు. తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టమని చెప్పాడు. అయితే కోహ్లీ బాగా కోట్లాడుతాడని సరదాగా అన్నాడు. కోహ్లీకి కోపం ఎక్కువ అని, అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడని ఈ సందర్భంగా గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇది ఇటీవల గొడవకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అని విరాట్ అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక జీవితంలో మీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? అని మరో ప్రశ్న అడగగా.. దీనికి గంగూలీ అసలు జీవితంలో ఒత్తిడి అనేది ఉండదని, కానీ భార్య, గర్ల్‌ఫ్రెండ్ వంటివాళ్లు ఒత్తిడిలోకి నెడుతారని సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఆ కార్యక్రమం అంతా కాసేపు నవ్వులతో నిండిపోయింది.