Sourav Ganguly, Jay Shah Can Have BCCI Term 2 After Supreme Court Order. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షా తమ పదవుల్లో కొనసాగేందుకు
By Medi Samrat Published on 14 Sep 2022 3:45 PM GMT
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షా తమ పదవుల్లో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఈ తీర్పు ఉపకరించనుంది. బీసీసీఐ రాజ్యాంగంలోని 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' నిబంధన ప్రకారం గంగూలీ, జై షాల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం గంగూలీ, జై షా వరుసగా రెండోసారి తమ పదవులు చేపట్టేందుకు సాధ్యం కాదు. అయితే ఈ 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' ను రద్దు చేస్తూ బీసీసీఐ తన రాజ్యాంగానికి సవరణ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సవరణ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
దీంతో గంగూలీ, జై షా రెండో పర్యాయం తమ పదవుల్లో కొనసాగనున్నారు. గంగూలీ, జై షా తమ తమ రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నప్పటికీ, దానితో సంబంధం లేకుండా బీసీసీఐ పదవుల్లో కొనసాగే వెసులుబాటు లభించింది. ఆర్ఎమ్ లోధా కమిటీ క్రికెట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చేందుకు పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షా తమ పదవుల్లో కొనసాగేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.