55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్..!

మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు కుప్పకూలిపోయింది. రెండో టెస్టులో సిరాజ్ ఏకంగా 6 వికెట్లతో చెలరేగి సఫారీల భరతం పట్టాడు.

By Medi Samrat  Published on  3 Jan 2024 4:25 PM IST
55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్..!

మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు కుప్పకూలిపోయింది. రెండో టెస్టులో సిరాజ్ ఏకంగా 6 వికెట్లతో చెలరేగి సఫారీల భరతం పట్టాడు. అతని ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికాకు సిరాజ్‌ నాలుగో ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఐడెన్ మార్క్‌రమ్(2)‌ను పెవిలియన్ చేర్చాడు. ఆపై తన మరుసటి ఓవర్లోనే డీన్‌ ఎల్గర్(4)ను బౌల్డ్‌ చేసి డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌(3)ను బుమ్రా ఔట్‌ చేయగా, టోనీ డిజోర్జి(2)ని సిరాజ్ అవుట్ చేశాడు. రెండో స్పెల్‌లో సిరాజ్.. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేశాడు. ముఖేష్ కుమార్.. కేశవ్ మహారాజ్(3), కగిసో రబడ(5)లను అవుట్ చేయగా.. బుమ్రా.. బర్గర్(4)ను ఔట్ చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను తెరదించాడు.

Next Story