మూడో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్ పాత్రకు, ఓపెనర్ పాత్రకు పెద్దగా తేడా లేదని భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఛతేశ్వర్ పుజారా స్థానంలో గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. సిరీస్ ఓపెనర్‌గా యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.
ఈ క్రమంలో గిల్ మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్.. తనను ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావని అడిగినట్లు.. తాను నం.3లో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినట్లు వెల్లడించారు. కొత్త బంతిని ఎదుర్కొవడం ఎప్పుడూ మంచిదేనని గిల్ అన్నాడు. నాకు కొత్త బంతితో ఆడిన అనుభవం ఉంది. నెం.3లో బ్యాటింగ్ చేసినప్పుడు అది ఓపెనింగ్‌కు అంతగా భిన్నంగా ఉండనప్పటికీ.. కొంచెం తేడా ఉంది. అయినా.. తనను తాను ఇంకా సీనియర్ ఆటగాడిగా భావించడం లేదని గిల్ అన్నాడు. ఆటకు ఒక నెల విరామం దొరకడంతో ఆనందించానని.. తన కుటుంబంతో చాలా సమయం గడిపానని చెప్పాడు. బార్బడోస్‌లో ఇది నా మొదటి పర్యటన.. డొమినికాలో విండీస్‌పై ఆడటం కూడా ఇదే మొదటిసారి అని గిల్ చెప్పాడు.
గిల్ స్వయంగా మూడవ స్థానంలో ఆడాలనుకుంటున్నందున 3వ నంబర్‌లో ఆడతాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. రాహుల్ (ద్రావిడ్)తో చర్చించాడు. తాను 3, 4 నంబర్‌లలో ఆడాను అని గిల్ ద్రవిడ్‌తో చెప్పాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ద్వారా జట్టుకు మెరుగైన ప్రదర్శన చేయగలనని గిల్ భావిస్తున్నాడని రోహిత్ పేర్కొన్నాడు.