పాక్ బౌలర్ యార్కర్.. ఆస్పత్రి పాలైన అఫ్గాన్ బ్యాటర్
Shaheen Afridi's deadly yorker sends Afghanistan opener to hospital.అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2022 2:01 PM ISTఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫైయర్, వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి. బుధవారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. గాయం కారణంగా ఇటీవల జరిగిన ఆసియాకప్‌కు దూరంగా ఉన్న పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది తిరిగి జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. తన పేస్ బౌలింగ్‌తో అఫ్గాన్ బ్యాటర్‌ను ఆస్పత్రికి పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన షాహీన్ అఫ్రిది.. అఫ్గాన్‌పై మాత్రం రెచ్చిపోయాడు. తన పేస్ తో అప్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రహమనుల్లా గుర్భాజ్, హజరతుల్లా జబైయ్‌ల వికెట్లు తీశాడు.
— Guess Karo (@KuchNahiUkhada) October 19, 2022
ఇందులో.. గుర్బాజ్‌ను యార్కర్‌తో ఔట్ చేశాడు షాహీన్. ఆ బంతి నేరుగా గుర్బాజ్ ఎడమ కాలి పాదానికి బలంగా తాకింది. బంతి గట్టిగా తగలడంతో గుర్బాజ్ నొప్పితో విలవిలలాడాడు. నడవలేకపోవడంతో గ్రౌండ్ సిబ్బంది అతడిని వీపుపై మోసుకుని మైదానం బయటికి తీసుకువెళ్లారు. దీంతో కాసేపు మ్యాచ్‌ను ఆపాల్సి వచ్చింది. గుర్బాజ్‌ను ఆ తర్వాత స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. షాహీన్ అఫ్రిది ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు మాత్రమే వేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇక .. షాహీన్ అఫ్రిది ఫామ్ అందుకోవడం టీమ్ఇండియాకు ప్రమాద గంటికలను మోగిస్తుంది. ఆదివారం సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లకు పొట్టి ప్రపంచకప్‌లో ఇదే ఆరంభ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విషయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు బావిస్తున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.