టీ20 ప్రపంచ కప్‌లో మరో సంచలనం

Scotland stun Windies with a 42-run win. టీ20 వరల్డ్ కప్ లో మరో పెద్ద జట్టుకు షాక్ తగిలింది. రెండు సార్లు ఛాంపియన్ విండీస్ స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.

By Medi Samrat  Published on  17 Oct 2022 5:19 PM IST
టీ20 ప్రపంచ కప్‌లో మరో సంచలనం

టీ20 వరల్డ్ కప్ లో మరో పెద్ద జట్టుకు షాక్ తగిలింది. రెండు సార్లు ఛాంపియన్ విండీస్ స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. హోబర్ట్‌లోని బల్లెరివ్ ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలో కేవలం 118 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 42 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. జాసన్ హోల్డర్ (33 బంతుల్లో 38 పరుగులు), కైల్ మేయర్స్ (13 బంతుల్లో 20 పరుగులు) మినహా విండీస్ జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు. విండీస్ కెప్టెన్ పూరన్, పవర్ హిట్టర్ రావెమన్ పొవెల్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. బ్లాడ్ వేల్, లీస్క్ రెండు వికెట్లతో సత్తా చాటారు. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే 53 బంతుల్లో 66 పరుగులు చేశాడు. క్రిస్ గ్రీవ్స్ 16 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరు కాకుండా మెక్‌లియోడ్ 23, జోన్స్ 20 పరుగులు చేశారు.


Next Story