బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.

By Medi Samrat
Published on : 15 April 2025 9:30 PM IST

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది. ఈ పర్యటనలో మూడు ODIలు, మూడు T20Iలు ఉంటాయి.. మ్యాచ్‌లు మీర్పూర్, చటోగ్రామ్‌లలో షెడ్యూల్ చేశారు.

ODI సిరీస్ ఆగస్టు 17న మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది, ఆగస్టు 20న రెండవ ODI కూడా ఇక్కడే జరగనుంది. చివరి ODI ఆగస్టు 23న చటోగ్రామ్‌లో జరుగుతుంది. ఇక టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆగస్టు 26న, రెండో మ్యాచ్‌ ఆగస్టు 29న, చివరి మ్యాచ్‌ అదే నెల 31న జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకోనుండగా.. పర్యటన ముగించుకొని సెప్టెంబర్ 1న తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది. అంతకుముందు టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో బ్రిటీష్‌ జట్టుతో భారత్‌ ఐదు టెస్టులు ఆడనున్నది. ఈ సిరీస్‌ జూన్‌ 20న ప్రారంభమవుతుంది.

Next Story