సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. సంజూ పూర్తీ ఫిట్ నెస్ సాధించడమే ఇందుకు కారణం. వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించేందుకు సంజూకు లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు కుడి చేతి చూపుడు వేలికి గాయం కావడంతో గత మూడు మ్యాచ్‌లలో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. బ్యాటింగ్ మాత్రమే చేస్తూ వచ్చాడు.
సంజూ శాంసన్ ఫిట్‌నెస్ టెస్టుల్ని క్లియర్ చేయడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వికెట్ కీపిం చేపట్టేందుకు సంజూకు ఉన్న అన్ని ఆంక్షలు పోయాయి. సంజూ శాంసన్ స్థానంలో గత మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. రాజస్థాన్ ఒకటి గెలవగా, మరో రెండింటిలో పరాజయం పాలైంది.