Video : 10 ఏళ్లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.. అవార్డ్ పంక్ష‌న్‌లో మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు..!

సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్క‌డ అత‌డికి సత్కారం కూడా జ‌రిగింది.

By -  Medi Samrat
Published on : 8 Oct 2025 8:50 PM IST

Video : 10 ఏళ్లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.. అవార్డ్ పంక్ష‌న్‌లో మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు..!

సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్క‌డ అత‌డికి సత్కారం కూడా జ‌రిగింది. శాంసన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. అవార్డ్ అందుకుంటున్న సమయంలో సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే తన క్రికెట్ పోరాటాన్ని, కష్టాన్ని కూడా వివరించాడు.

సంజూ శాంసన్ తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, గాయాలు, జట్టులో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టమైన క్షణాలను అభిమానులతో నవ్వుతూ పంచుకున్నాడు. కేవలం గణాంకాలే కాదు, ఏళ్ల తరబడి పోరాటం, అనుభవం, దేశం కోసం ఆడ‌టం ప‌ట్ల త‌న‌కు అపారమైన అంకితభావం కూడా దాగి ఉన్నాయని సంజు మాటలను బట్టి అర్థమైంది.

సంజూ శాంసన్ మాట్లాడుతూ.. భారత జెర్సీ ధరించినప్పుడు దేనికీ నో చెప్పడం సాధ్యం కాదని శాంసన్ అన్నాడు. నేను దీన్ని సాధించడానికి చాలా కష్టపడ్డాను. దేశం కోసం నా వంతుగా కొంత‌ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. నేను 9వ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నా, లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయాలన్నా, జట్టు అవసరాన్ని బట్టి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఇటీవలే నేను అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, అయితే 10 ఏళ్ల‌ కాలంలో నేను 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాను. గణాంకాలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ సంవత్సరాలుగా నేను అధిగమించిన‌ సవాళ్లు, ఆ క్ర‌మంలో ప‌రిపూర్ణ‌మైన‌ వ్యక్తిగా మారినందుకు నేను గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ ఎమోషనల్‌గా కనిపించడం గమనార్హం. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అతడు మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న‌ట్లు మాత్రం తెలుస్తుంది. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి సంజూ మొత్తం 65 మ్యాచ్‌లు (16 వన్డేలు, 49 టీ20లు) ఆడాడు.

Next Story