భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రీ మ్యాచ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ సమయంలో సూర్యకుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ విని అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక్కడ సీక్రెట్స్ అన్నీ చెప్పాలా అని ఎదురు ప్రశ్నించాడు సూర్య.
అసలు మీ గేమ్ ప్లాన్ ఏమిటని విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్‌ను అడగగా.. సూర్య అన్ని రహస్యాలు ఇక్కడే చెప్పాలా అని బదులిచ్చాడు.. నేను నా ఆటను ఆస్వాదిస్తున్నాను.. మేము మా బృందాన్ని సిద్ధం చేయాలి.. ఐక్యతతో ఆడాలని చూస్తున్నాం.. ఇదే మా కోచ్, నా దృష్టి అని పేర్కొన్నాడు. సూర్యకుమార్ ఇచ్చిన సమాధానం విని అందరూ సైలెంట్ అయిపోయారు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ జనవరి 22న, రెండో మ్యాచ్ జనవరి 25న, మూడో మ్యాచ్ జనవరి 28న జరగనుంది. సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జనవరి 21న, చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి.