డ్రీమ్ హౌస్‌లో ఉంటున్న సంజూ శాంసన్‌.. విలాసవంతమైన ఆ ఇంటి రేటు ఎంతో తెలుసా.?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు.

By Medi Samrat  Published on  22 Jan 2025 11:23 AM IST
డ్రీమ్ హౌస్‌లో ఉంటున్న సంజూ శాంసన్‌.. విలాసవంతమైన ఆ ఇంటి రేటు ఎంతో తెలుసా.?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను సెల‌క్ట‌ర్లు ప‌క్క‌కుపెట్టారు. సంజూ శాంసన్‌ను కాద‌ని రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు. గ‌త ఏడాది త‌క్కువ స‌మ‌యంలోనే సంజు మూడు వ‌రుస టీ20 సెంచ‌రీలు న‌మోదు చేశాడు. అయినా ఛాంపియన్స్ ట్రోఫీకి జాతీయ జట్టులోకి ఎంపిక కాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంజూ శాంసన్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. అత‌డి గురించి ప‌లు విష‌యాలు నెటిజ‌న్లు చ‌ర్చిస్తున్నారు. వాటిలో సంజు శాంసన్ జీవితానికి సంబంధించిన విష‌యాల‌ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.

సంజు శాంసన్ 11 నవంబర్ 1994న జన్మించాడు. అతడు దేశ‌వాళీ క్రికెట్ కేరళ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో సంజూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌. సంజూ 2019-2020 సీజన్‌లో గోవాపై కేరళ తరపున 212 పరుగులు చేయడంతో విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ సృష్టించాడు.

సంజు శాంసన్ తన భార్య చారులత శాంసన్‌తో కలిసి కేరళలో నివసిస్తున్నాడు. కేరళతో పాటు బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా సంజూకు ఆస్తులు ఉన్నాయి. సంజు తిరువ‌నంత‌పురంలోని విజింజంలో విలాసవంతమైన డిజైనర్ ఇంటికి య‌జ‌మాని. అక్కడ సంజు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ బంగ్లా ధర దాదాపు రూ.6 కోట్లు ఉంటుంది. సంజు ఇంట్లో విశాల‌మైన‌ బాల్కనీ ఉంది.. అక్క‌డి నుంచి అహ్లాద‌క‌ర‌మైన‌ వాతావరణాన్ని ఆస్వాదించవ‌చ్చు. సంజు భార్య చారులత తమ‌ ఇంటి చిత్రాలను అప్ప‌డ‌ప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది.


సంజూ శాంసన్ నికర ఆస్తుల‌ విలువ దాదాపు రూ.82 కోట్లు. ఈ ఆస్తుల‌ను అంతర్జాతీయ మ్యాచ్‌లు, IPL మ్యాచ్‌లు, దేశ‌వాళీ క్రికెట్‌, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించాడు. BCCI ప్రకారం.. శాంసన్ 2024లో C-గ్రేడ్ కాంట్రాక్ట్ ఆటగాడు. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఓ ఆట‌గాడు ప్రతి సంవత్సరం కోటి రూపాయలు వేత‌నంగా పొందుతాడు. అలాగే.. సంజు ఒక ప్రకటన చేయడానికి 25 లక్షలు డిమాండ్ చేస్తాడ‌ని.. సంజు వివిధ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టిన‌ట్లు.. త్వారా అతడు భారీ ఆదాయాన్ని పొందుతున్న‌ట్లు ప‌లు నివేదిక‌లు ఉన్నాయి.

Next Story