అడిలైడ్ టెస్ట్ లో ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపాడు. బ్యాటింగ్ పరంగా తాము పూర్తిగా నిరాశపరిచామని, ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించిందన్నాడు. ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడిందన్నాడు. పెర్త్‌లో మా జట్టు అద్బుతమైన ప్రదర్శన చేసింది. అదే జోరును అడిలైడ్‌లోనూ కొనసాగించాలనుకున్నాము. కానీ ప్రతీ టెస్ట్ మ్యాచ్ ఓ సవాల్ లాంటింది. పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదని తమకు ముందే తెలుసన్నాడు.
ఈ ఓటమి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్ లో భారత్ అగ్రస్థానం నుంచి మూడవ స్థానానికి దిగజారింది. ఈ ఓటమి తర్వాత భారత ‘పాయింట్స్ పర్సెంటేజ్ సిస్టమ్’ పాయింట్లు 57.29కి తగ్గాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా పీసీటీ 60.71కి పెరిగి నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ఇక 59.26 పీసీటీతో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో నిలిచింది. భారత్ మూడవ ర్యాంకులో ఉండగా, శ్రీలంక నాలుగవ స్థానంలో ఉంది.