ఇండియా- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకుని వచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని, సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి, అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గుర్తించి, బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ ను అడిగాడు. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయినందుకు ఆ యువకుడికి జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
అంతకు ముందు కూడా పాక్ మ్యాచ్ సమయంలో ఓ అభిమాని దూసుకు వచ్చాడు. ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని, సెక్యూరిటీ కళ్లు గప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేస్తున్న భువీ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ కంచెను దాటి, క్రీజులోకి అడుగుపెట్టినందుకు సదరు క్రికెట్ ఫ్యాన్‌కి 9913.20 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.