నా ఆలోచన మారదు.. అందుకే మేము ఓడిపోయాం : రోహిత్
శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి విఫలమైంది.
By Medi Samrat Published on 5 Aug 2024 12:24 PM GMTశ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.. కానీ అతని ఇన్నింగ్స్ పెద్ద ఇన్నింగ్స్‌గా మారలేదు. ఈ విషయమై రోహిత్‌ని ప్రశ్నించగా.. తాను ఇలాగే ఆడుతున్నాను.. ఇలాగే ఆడతాను అని సూటిగా చెప్పాడు.
తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రెండో మ్యాచ్‌లో రోహిత్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. అతను జెఫ్రీ వాండర్సే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో.. ఆ షాట్‌ను ఆడకుండా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడే విధంగా తనను తాను నియంత్రించుకోలేకపోయాడా? అని విషయమై చర్చ నడుస్తుంది. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. "నేను చేసిన 65 పరుగులు.. నా శైలి బ్యాటింగ్‌లో చేసినవి. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం ఉంటుంది.. కానీ నేను దానికి భయపడను. ఔట్ అయినప్పుడు.. 0 లేదా 50 లేదా 100 వద్ద ఉన్నా.. మీరు నిరాశ చెందారు. కానీ అది నా ఆలోచనను మార్చదు. మేము మంచి క్రికెట్ ఆడలేదు, అందుకే మేము ఓడిపోయామని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఈ సులభమైన లక్ష్యం ముందు భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ వాండర్సే భారత బ్యాటింగ్ వెన్ను విరిచాడు. 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు.